PLD: పెదకూరపాడు కంభంపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి కూలీల పనితీరును ఏపీవో కోటమ్మ గురువారం పరిశీలించారు. కొలతల ప్రకారం పనిచేయాలని, పనికి తగ్గ వేతనం లభిస్తుందని ఆమె అన్నారు. ఒకరి పేరు మీద మరొకరు రాకూడదని ప్రతి ఒక్కటి ఆన్లైన్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. అటెండెన్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.