KDP: తొండూరు మండలంలోని మల్లేలలో ఆదివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. గ్రామానికి చెందిన రామిరెడ్డి సరోజమ్మ ఇంట్లో ఉండగా.. ఒక్కసారిగా మిద్దె కూలిపడింది. శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.