W.G: జిల్లా నుంచి ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, భీమవరం, నిడదవోలు తదితర రూట్లలో బస్ సర్వీస్లను పెంచామని జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO) వరప్రసాద్ తెలిపారు. ఇవాళ తాడేపల్లిగూడెం డిపోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత జిల్లాలో రోజు వారీ ప్రయాణికుల సంఖ్య 80 వేల నుంచి 1.20 లక్షలకు పెరిగిందన్నారు.