KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో ఈ నెల 27, 28 తేదీలలో క్లస్టర్ లెవెల్లో వర్చువల్‌గా నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేసేందుకు మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి విస్తృత స్థాయిలో ఏర్పాట్లపై దృష్టి సారించారు. శనివారం పెద్దకడబూరులో క్లస్టర్ ఇన్చార్జ్ నరవ రమాకాంతరెడ్డితో కలిసి చంద్రమ్మ ఫంక్షన్ హాల్‌ను పరిశీలించారు.