ATP: గుత్తి మండలం ఉబిచర్ల గ్రామ సమీపంలోని 44 హైవేపై ఆదివారం తెల్లవారుజామున బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో కర్నూలుకు చెందిన ప్రభాకర్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం గుర్తు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.