ATP: గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం ఆలయ పరిసరాలలో సోలార్ పవర్ ప్లాంట్, గోవుల ఎరువులు నుండి తయారు చేసే గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈవో విజయ రాజు మాట్లాడుతూ..నెడ్ క్యాప్ అనంతపురం ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలిస్తున్నామన్నారు.