NDL: జిల్లాలో రక్త కొరత రాకుండా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ జీ.రాజకుమారి సూచించారు. రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సమావేశంలో అన్ని పాఠశాలల్లో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్లు, కళాశాలల్లో యూత్ రెడ్ క్రాస్ బృందాలు ఏర్పాటు చేసి పెద్దఎత్తున విద్యార్థులను సభ్యులుగా నమోదు చేయాలని పేర్కొన్నారు.