W.G: పేరుపాలెం బీచ్ ఆదివారం పర్యాటకులతో సందడిగా మారింది. మే నెల అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో, ఎండల నుంచి ఉపశమనం కోసం అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. సముద్రపు కెరటాల్లో స్నానాలు చేసి, పక్కనే ఉన్న దేవాలయాలను దర్శించుకున్నారు. తీర ప్రాంతంలోని పచ్చని కొబ్బరి తోటల్లో చల్లని గాలల నడుమ వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఉల్లాసంగా గడిపారు.