ELR: ద్వారకాతిరుమలలో సోమవారం రాత్రి ఓ భక్తుడి కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆకివీడుకు చెందిన ఒక భక్తుడు శ్రీవారి దర్శనానంతరం కారులో స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. షణ్ముఖ కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి కారుకి ఓ బైక్ అడ్డొచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో కారు రోడ్డు మధ్యలోని డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.