W.G: తణుకులో వంట నూనెలు కల్తీ జరుగుతున్నట్లుగా వచ్చిన సమాచారంతో జిల్లా విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావు ఆదేశాల మేరకు శుక్రవారం పలు ఆయిల్ మిల్లులపై అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీనివాస ఆయిల్ అండ్ ఫ్లోర్ మిల్లు, ఉమామహేశ్వర ఫ్లోర్ అండ్ ఆయిల్ మిల్లు, లక్ష్మీ ఆయిల్ అండ్ ఫ్లోర్ మిల్లులో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆ మిల్లుల్లో ఆహార భద్రత లైసెన్సులు లేవని గుర్తించారు.