VZM: కాపుసోంపురం వంతెన వద్ద ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు ఎస్.కోట పట్టణ సీఐ వి. నారాయణ మూర్తి సోమవారం తెలిపారు. వివరాల మేరకు సబ్బవరం మండలం దువ్వాడ కాలనీ చెందిన కిలారి గంగన్న, అతని స్నేహితుడు ఆదర్శ్ ద్విచక్ర వాహనంపై అరకు నుండి వస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.