ATP: ఆత్మకూరు మండలం పంపనూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ మంజునాథ స్వామి, పార్వతి అమ్మవార్లను MLA పరిటాల సునీత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు.