అన్నమయ్య: చిట్వేలి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినుల కోసం గురువారం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యుడు డాక్టర్ మహమ్మద్ అన్సారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఆప్తలామిక్ అధికారి ఓబులేసు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలున్న వారికి సూచనలు, సలహాలు అందించారు.