ELR: ముసునూరు MPDO కార్యాలయంలో ఇవాళ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి గురువారం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.