VZM: ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందవచ్చని రీజనల్ ధీమాటిక్ అధికారి ప్రకాష్ అన్నారు. ఎస్ కోట మండలం ఎస్.కోట తలారిలో మంగళవారం ఆయన రైతులతో వరి పంటలో ఆర్డీఎస్ విధానంలో రాగులు, జొన్నలు, సజ్జలు, బెండ తదితర అపరాలను వేయించారు. ఈ విధానం ఆచరించడం వల్ల పంటకు సూక్ష్మ, స్థూల పోషకాలు అందడంతో పాటు భూసారం పెరుగుతుందన్నారు.