సత్యసాయి: హిందూపురంలో ఆదివారం తొలి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసు నమోదు అయింది. గ్రామీణ మండలానికి చెందిన 42ఏళ్ల మహిళకు వారం రోజులుగా జ్వరం, ఆయాసం ఉండడంతో వైద్యులు అనుమానంతో పరీక్షలు చేయగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణయింది. అలాగే నిన్న రెండేళ్ల బాలుడిపై నిర్వహించిన పరీక్షలు నెగెటివ్‌గా వచ్చాయి.