బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, అర్బన్) పథకం ద్వారా నిర్మించిన గృహాలను ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పేదలందరికీ ఇళ్లు అందించే చారిత్రాత్మక కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.