ATP: మంత్రి పయ్యావుల కేశవ్ తన చిన్ననాటి గురువును పుట్టపర్తిలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉంటున్న తన ఉపాధ్యాయుడు గంగాధర శాస్త్రి వద్దకు వెళ్లిన మంత్రి ఆయన కాళ్లు మొక్కి ఆశీస్సులు పొందారు. తన విద్యార్థి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎదగడం చూసి అమితానందం కలిగిందని గురువు గంగాధర శాస్త్రి తెలిపారు.