కృష్ణా: మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ వైద్యశాలను రీజినల్ కిల్కారి ప్రోగ్రాం ఆఫీసర్ రాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలను కలసి కిల్కారి సేవల గురించి అడిగి తెలుసుకుని, అనంతరం కిల్కారి సేవల ప్రాముఖ్యత గురించి వివరించారు. కిల్కారి కాల్ నెంబర్ 911600403660ను గర్భిణీలు, బాలింతలు తమ మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని సూచించారు.