AKP: మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీని గరిష్ట స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా సోమవారం సాయంత్రానికి 136.25 మీటర్లకు చేరుకుంది. తుఫాను కారణంగా ఎగువన వర్షాలు పడుతుండడంతో జలాశయంలోకి 125 క్యూసెక్కుల వరుదనీరు వచ్చి చేరుతున్నట్లు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. దీంతో 300 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెట్టినట్లు తెలిపారు.