VZM: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని జేసి ఎస్.ఎస్. శోభిక సిబ్బందిని ఆదేశించారు. సాలూరు మండలం శివరాంపురం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో అనుసరిస్తున్న చర్యలు, నాణ్యత ప్రమాణాల తీరును పరిశీలించారు. ట్రాక్ షీట్ రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు.