విశాఖ: కార్తీకమాస పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కుటుంబ సమేతంగా గరిడీతో కాలినడకన సింహాచల శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని బుధవారం దర్శించుకున్నారు. ఈ గరిడీ యాత్రలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్యనేత పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్ కూడా పాల్గొని, అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.