కృష్ణా: దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి దేశాన్ని సుసంపన్నం చేసిన మహానీయుడు జవహర్ లాల్ నెహ్రూ అని ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో భారతదేశ తొలి ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నెహ్రూ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.