GNTR: పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం నగరంలోని 45వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వాటిలో రజక వర్గానికి భవన సదుపాయం కల్పించేలా గౌతమి నగర్ 6వ లైన్లో కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ భవనం నిర్మాణానికి రూ.21.50 లక్షల నిధులు కేటాయించారు.