అన్నమయ్య: ఫిబ్రవరి 1న తమిళనాడులోని తిరుపత్తూరు, అలాగే ఫిబ్రవరి 2న తిరుపతిలో జరిగే అఖిలభారత ఉర్దూ కవి సమ్మేళనాలకు మదనపల్లె ఉర్దూ కవులు బాబా ఫక్రుద్దీన్ అలియాస్ ఖమర్ అమీని, పఠాన్ మహమ్మద్ ఖాన్లకు ఆహ్వానం అందింది. గురువారం వారు మాట్లాడుతూ.. ఉర్దూ భాషలో నిర్వహించే ఈ కవి సమ్మేళనాలు మతసామరస్యం, జాతీయ సమైక్యతకు దోహదపడుతాయన్నారు.