ELR: ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని భీమడోలు బ్రిడ్జ్ నుంచి పెద లింగంపాడు వెళ్లే రోడ్డుకు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రత్యేక చొరవతో మోక్షం లభించింది. బుధవారం భీమడోలు NH -16 నుంచి సాదుగారి దిబ్బ, చిన్న లింగంపాడు మీదుగా పెద లింగంపాడు వరకు నాబార్డ్ నిధులు రూ.95 లక్షల అంచనాతో నిర్మించబోయే సీసీ, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.