CTR: స్మశాన వాటికకు సరైన స్థలాలను కేటాయించాలని దళిత నాయకుడు రాజా మోకాళ్లపై నిలబడి MROకు మొరపెట్టుకున్నాడు. మంగళవారం పుంగనూరులో జరిగిన విజిలెన్స్ కమిటీ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నక్క బండలో ఒకరు మృతి చెందితే దహనం చేసేందుకు ఆవస్తులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ప్రతి చోట వంకలు, చెరువులు సమీపానే దళితులకు స్మశాన వాటికలను కేటాయించారని బాధపడ్డారు.