NDL: పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని నంద్యాల డీఈవో జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గడువు లోపు ఫీజు చెల్లించకపోతే రూ. 50 రుసుంతో వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ. 200 రుసుంతో 10వ తేదీ, రూ. 500 రుసుంతో 15వ తేదీ వరకు చెల్లించాలని వివరించారు.