సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గం గంటాపురం గ్రామంలో నూతన రామాలయం గుడి ధ్వజస్తంభ ప్రతిష్టాపన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బీరప్ప దేవాలయంలో ఎంపీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.