SKLM: ఆమదాలవలస పట్టణంలోని ప్రధాన మార్కెట్ పరిసరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కమిషనర్ టి .రవి సోమవారం మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదచారుల మార్గం వరకు దుకాణాలను విస్తరించి వ్యాపారాలు చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. రోడ్లను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.