సత్యసాయి: పెనుకొండలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం సొంత నిధులతో ఆర్చ్ నిర్మాణం చేపడతానని మంత్రి ప్రకటించారు. భక్తుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.