GNTR: పొన్నూరులో బుధవారం రాత్రి ఈద్గా సమీపంలో షేక్ నబీన్పై కొందరు దాడి చేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అడ్డగించి కత్తితో బెదిరించి, మార్కెట్ జెండా చెట్టు వద్ద కర్రలు, రాడ్లతో కొట్టినట్లు బాధితుడు తెలిపాడు. గాయాలతో నిడుబ్రోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.