కోనసీమ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముమ్మిడివరం నియోజకవర్గం, చెయ్యేరు గ్రామంలో జనసైనికులు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మండపేట జనసేన ఇంఛార్జ్ లీలా కృష్ణ ప్రారంభించారు. జనసైనికులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన దాతలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.