E.G: అత్యవసర మరమ్మతులకు ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజమండ్రిలోని కోటిలింగాల పేట, సీతంపేట ఎన్టీఆర్ కాలనీ, గోదావరి గట్టు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని కోరారు