AKP: కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం కలెక్టరేట్లో శాఖలవారీ సమీక్ష నిర్వహించి నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు హెచ్చరించారు. మొదటి విడతలో 24 మ్యాజిక్ డ్రైన్లు పూర్తి చేసినట్లు అన్నారు. రెండో విడతలో మరో 24 పనులను త్వరగా ముగించాలని సూచించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 100రోజుల పనిదినాలు కల్పించాలని ఆమె వెల్లడించారు.