GNTR: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల ప్రాంగణంలో ఓ అనాథ వృద్ధుడు గత 2రోజులుగా దీన స్థితిలో ఉన్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. అనారోగ్యంతో తీవ్రంగా నీరసించి, ఆరుబయట ఒంటరిగా ఉన్న ఆ వృద్ధుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఆయనకు యూరిన్ పైపు అమర్చి ఉంది. వృద్ధుడి దుస్థితి చూసినా, ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారులు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.