ప్రకాశం: పొన్నలూరు మండలం వెంకుపాలెంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి రాగి తీగ చోరీ చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది ట్రాన్స్ఫార్మర్లో కాపర్ వైర్లను వేరు చేసి దొంగిలిస్తున్నారని, ఒక్కో ట్రాన్స్ఫార్మర్లో ఉండే రాగి తీగ విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారి వీరాంజనేయులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై దర్యాప్తు చేపట్టారు.