CTR: ఈ నమోదుపై శుక్రవారం నుంచి ఈ నెల 17 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ గురువారం తెలిపారు. జిల్లాలో 9,84,132 సర్వే నంబర్లు ఈ-పంట నమోదు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 9,54,916 సర్వే నంబర్లు నమోదు చేసి 98శాతం పూర్తి చేశామన్నారు. రైతులచే గ్రామసభలు నిర్వహించి వినతులు స్వీకరిస్తామన్నారు.