కోనసీమ: మండపేట నియోజకవర్గం రాయవరం(M) చెల్లూరుకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు మంత్రి నారాలోకేశ్ అండగా నిలిచారు. తన సొంత నిధులతో ట్రై స్కూటీ అందజేస్తానని గత నెలలో ట్విట్టర్లో లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళగిరిలో మంగళవారం జరిగిన ప్రజాదర్బార్లో ట్రై స్కూటీ అందజేయటంతో వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.