AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో క్షేత్రపాలకుడైన వేణుగోపాల స్వామికి ఆదివారం లక్ష తులసి పూజను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచకలశారాధన, పంచామృతాభిషేకం జరిపించారు.అలాగే గోదాదేవి సన్నిధిలో లక్ష కుంకుమార్చన నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు తెలిపారు.