ATP: గుంతకల్లు సబ్ డివిజనల్, రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీసు కార్యాలయాలను ఎస్పీ పి. జగదీష్ గురువారం వార్షిక తనిఖీలో భాగంగా సమీక్షించారు. గ్రేవ్, నాన్-గ్రేవ్, ప్రాపర్టీ అఫెన్సెస్, రికవరీ శాతం వంటి కేసుల్లో పురోగతిని ఆరా తీశారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల నియంత్రణకు గాను విద్యా సంస్థలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.