విశాఖలో జరగనున్న CII సమ్మిట్ కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల రాకపోకల నిమిత్తం సుమారు 1000 వాహనాలను సిద్ధం చేశారు. ఈ వాహనాల కదలికను పోలీసులు, రవాణా, రెవెన్యూ అధికారులు నిరంతరం మానిటర్ చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వాహనాలు విశాఖకు చేరుకున్నాయి.