VZM : బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని అంతర్జాతీయ బ్రెయిన్ యోగా శిక్షకులు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు. గ్రంథాలయ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి,నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం వంటివి బ్రెయిన్ యోగతో సాధ్యమన్నారు.