E.G: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేపు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల పనులను ఆదివారం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యవేక్షించారు. పలు అధికారులు పర్యవేక్షణలో జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగ్గంపేట ఎస్సై టి రఘునాథరావుతో మాట్లాడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను మళ్ళించాలని ఆదేశించారు.