GNTR: జిల్లాలో రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ అంశాల పట్ల అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయిలో రెవెన్యూ నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అందిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు.