ATP: జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ఈ-పంట నమోదు ముసాయిదా జాబితాను నేటి నుంచి 17వ తేదీ వరకు సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, తప్పులుంటే ఆర్ఎస్కే సిబ్బందికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు 19 లక్షల ఎకరాలకుపైగా ఈ-పంట నమోదు చేసినట్లు ఆమె వివరించారు.