విజయనగరం 27వ డివిజన్ జొన్నగుడ్డి వీధిలో శుక్రవారం ప్రజలు వినియోగించకోవడానికి నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌ను నగర మున్సిపల్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుప్పాడ సునీత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.