ELR: గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ శ్రీ దివ్య అన్నారు. పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. దీని ద్వారా ఆరోగ్యవంతమైన ప్రసవం కష్టం లేకుండా జరుగుతుందని తెలిపారు.