CTR: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని మున్సిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేస్తున్న పలు కేడర్ టీచర్లకు నేడు, రేపు (ఆది, సోమవారం) ప్రమోషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు HMగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నట్లు తెలిపారు. సీనియార్టీ జాబితాను ఇప్పటికే ఎంఈఓలకు పంపామన్నారు.