BPT: బాపట్ల నియోజకవర్గం జాతీయ స్థాయి యోగాసన పోటీలకు వేదిక కానుంది. జిల్లెల్లమూడిలో డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. మంగళవారం ఆయన వేదికను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులకు వసతి కల్పిస్తున్నామన్నారు. యోగా విశిష్టతను చాటేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.